చిన్నప్పటినుంచే డాక్టర్ అవుతావా.. ఇంజనీర్ అవుతావా.. అని పిల్లలను టార్చర్ పెట్టద్దని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొత్త పోకడలు పోతున్న విద్యా వ్యవస్థలు పట్ల టీచర్లు కి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.మారుతున్న సమాజానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మారకపోతే వెనుకబడి పోతామని…మన కంటే నాలుగు రెట్లు ముందు జపాన్ ఆలోచనలు ఉన్నాయి.. అందుకే వాళ్ళు ముందు ఉన్నారని మండి పడ్డారు.
చిన్నప్పటి నుంచి పిల్లలను డాక్టర్ అవుతావా? ఇంజినీర్ అవుతావా అని టార్చర్ మొదలు పెడతారని…రెసిడెన్షియల్ విద్యా సంస్థలు లో రుద్దే రద్దుడు మరొక ఆలోచన రానివ్వదని మండి పడ్డారు. అటువంటి విధానం దేశానికి రాష్ట్రానికి అసలు మంచిది కాదు..చిన్న పిల్లలు లో తెలుసుకోవాల్సిన ఆసక్తి చాలా ఉంటుందన్నారు. తెలంగాణ లో ఆవిష్కరణ లకు పెద్ద పీట వేశాము..తెలంగాణ లో విద్యా యజ్ఞం ప్రారంభం అయిందన్నారు.నా చిన్నతనము లో మా అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు చాలా ప్రయోగాలు చేసేవాళ్ళమని ఫైర్ అయ్యారు.