ఇక్కడి సీఏల సహాయంతో చైనా దందా.. ఏకంగా 1268 కోట్ల లావాదేవీలు !

-

చైనా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల కేసులో ఈడీ సోదాలు చేస్తోంది. ఢిల్లీ, గుర్ గాం, ముంబై, పూణే లోని 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ నాలుగు హెచ్ఎస్ బీసీ బ్యాంకు ఖాతాల్లో రూ. 47 కోట్లు ఫ్రీజ్ చేసింది. 17 హార్డ్ డిస్క్ లు, 5 ల్యాప్ టాప్ లు, ఫోన్ లు, కీలక ఆధారాలు కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ సీసీఎస్ లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

 

ఈ కామర్స్ పేరుతో చైనీయులు వందలాది బెట్టింగ్ యాప్ లు నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడయింది. డాకీ పే కంపెనీ ఒక్క ఏడాదిలోనే సుమారు రూ. 1268 కోట్ల లావాదేవీలు చేసినట్లు ఈడీ గుర్తించింది. సీఏల సహకారంతో చైనీయులు భారత్ లో పలు కంపెనీలు సృష్టించినట్లు ఈ దర్యాప్తులో గుర్తించారు. అలానే మొబైల్ వాలెట్ లతో ఎక్కువగా లావాదేవీలు జరిపినట్టు కూడా ఈడీ గుర్తించింది. అలానే ఆన్ లైన్ వాలెట్ సంస్థలు, హెచ్ ఎస్ బీసీ, ఆర్వోసీ ల నుంచి ఈడీ మరింత సమాచారం సేకరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news