సామాన్యుడికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. గ్యాస్, వంట నూనెలు ఇలా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. తాాజాగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు ఇండోనేషియా పామ్ ఆయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో నూనె ధరల రేట్లు విపరీతంగా పెరిగాయి. మన దేశానికి అవసరమయ్యే నూనెల్లో 90 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి అవుతోంది. దేశంలో నూనె గింజల సాగు దేశ అవసరాలను తీర్చే విధంగా లేదు.
ఇండోనేషియా తమ దేశంలో పామాయిల్ ధరలు దిగిరావడం కోసం ఎగుమతులపై ఆంక్షలు పెట్టింది. దీంతో దీని ప్రభావం ఇండియాపై పడింది. ఇండియాకు వచ్చే పామాయిలో లో 70 శాతం పైగా ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచే దిగుమతి అవుతోంది. దీని కారణంగా పామాయిల్ ఆయిల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆయిల్ పెడ్ నెలరోజుల వ్యవధిలో పామాయిల్ ధరను రూ.29కి పెంచింది.
ఇదిలా ఉంటే రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం దేశంలో సామాన్యుడిపై కనిపిస్తోంది. మనకు దిగుమతి అయ్యే సన్ ఫ్లవర్ ఎక్కువగా ఉక్రెయిన్, రష్యా దేశాల నుంచే వస్తోంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్ దిగుమతులపై ప్రభావం ఏర్పడింది. దీంతో సన్ ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్ కు రూ.24 వరకు పెరిగింది. జనవరిలో లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ ధర రూ. 134 ఉంటే ప్రస్తుతం రూ.158 అయింది. ఇక పల్లి నూనెపై రూ. 23 వరకు పెరిగింది.