మార్చి 8న వనపర్తిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… పాలనపై పూర్తి దృష్టి సారించారు. ఇప్పటికే పలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించి… బహిరంగ సభలలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే మార్చి 8వ తేదీన వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ వనపర్తి పర్యటనలో…. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

ముఖ్యంగా వనపర్తి నుంచి సీఎం కేసీఆర్ “మన ఊరు మన బడి” కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనం తో పాటు కన్నెతాండ లిఫ్ట్ ప్రాజెక్టు ను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. వనపర్తి జిల్లాలో కొత్తగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డు, లాగి టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల అనంతరం సీఎం కేసీఆర్ వనపర్తి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్ పయనం కానున్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు తెలంగాణ సీఎంఓ.

Read more RELATED
Recommended to you

Latest news