మల్లారెడ్డి లాంటి నాయకులు తాము చెప్పిన మాట వినకపోగా కేసీఆర్ భజన చేస్తున్నారన్నది రెడ్ల ఆరోపణ. ఈ సారి కేసీఆర్ భజన ఎక్కువ స్థాయిలో ఉంది కానీ తమకు న్యాయం చేయాలన్న సోయి ఆయనకు లేదన్నది వారి ఆవేదన. రెడ్లంతా ఏకమై న్యాయం అనిపించే డిమాండ్ల కోసం పనిచేయాల్సి ఉంది అన్నది వారి వాదన. దాడి ఎవరు చేసినా తప్పే కానీ, ఈ ఎపిసోడ్ లో పాలక వర్గాల వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయన్న వాదన కూడా ఉంది. రెడ్డి కార్పొరేషన్ సాధన అన్నది ఓ ధ్యేయంగా పనిచేస్తున్న వర్గాలకు మల్లారెడ్డి అండగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్న వాదన కూడా వినిపిస్తో్ంది. కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వీళ్లంతా ఎవరి స్వార్థం వారు వెతికి ఉన్నారు అని ఓ భావన సంబంధిత వర్గాల్లో స్థిరం అయిపోయింది.
తెలంగాణ వాకిట కులాల ఐక్యత కోసం పోరాడాల్సిన నాయకులు ఎవరికి వారు తమ దారిలో తాము పోతున్నారన్న విమర్శలకు కారణం అవుతున్నారు. పోనీ సొంత సామాజిక వర్గంకు చెందిన డిమాండ్లు అయినా పట్టించుకుంటున్నారా అంటే అదీ లేదు. ఇక సాధ్యం కాదు అన్నవి ఏవీ లేవు కానీ వీలున్నంత వరకూ ప్రజల డిమాండ్లను వినేందుకు కూడా ఇష్టపడడం లేదు. దీంతో ప్రతిసారీ అక్కడ యుద్ధ వాతావరణమే నెలకొంటుంది. ఇటు ఆంధ్రాలో కూడా కులాల కార్పోరేషన్లు ఇచ్చారే కానీ నిధుల్లేవు. ఎలా చూసుకున్నా కేసీఆర్ కు మళ్లీ మళ్లీ ప్రజాగ్రహం భరించక తప్పేలా లేదు.
వాస్తవానికి ఎన్నో రోజుల నుంచి కేసీఆర్ పాలనపై తిరుగుబాటు ఉంది. ప్రత్యామ్నాయ రాజకీయం మాత్రం అందుకు అనుగుణంగా లేదు. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ నిర్మాణం పూర్తయితే మంచి ఫలితాలే వస్తాయి. ఆ విధంగా కేసీఆర్ ఇప్పటిదాకా నిరాటంకంగా పాలిస్తున్నారు. తమ పాలన తప్పిదాలను వాటి వైఫల్యాలను విపక్షాలు నిలదీసే ముందే జాగ్రత్త పడిపోయి బీజేపీపై వెర్బల్ ఎటాక్ ఇస్తున్నారన్న వాదన కూడా ఉంది. పాలన సంబంధ వైఫల్యాలను దిద్దుకోకుంటే వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదు అన్న అభిప్రాయం ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ వినిపిస్తున్న అభిప్రాయం.