ప్రస్తుతం ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భూపేష్ భగేల్ నాయకత్వంలో సమర్ధవంతమైన పాలనను ప్రజలు అందుకుంటున్నారు. తాజాగా ఈ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఒక సంఘటన పార్టీ నాయకత్వాన్ని వేలెత్తి చూపించేలా ఉంది. ఈ రాష్ట్రంలో విద్యాశాఖామంత్రిగా ఉన్న ప్రేమ్ సాయి సింగ్ హఠాత్తుగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఒక్కసారిగా ఏమి జరిగిందో ఎవ్వరికీ అర్ధం కానీ పరిస్థితి. కానీ రాజీనామా చేసిన అనంతరం ప్రేమ్ సాయి సింగ్ మాట్లాడుతూ ఇందులో నా ప్రమేయం ఏమీ లేదని, నా సొంత నిర్ణయం అంతకన్నా కాదని ప్రజలకు తెలియచేశాడు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు సీఎం ప్రేమ్ సాయి సింగ్ చేత రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ రాష్ట్రానికి PCC అధ్యక్షుడిగా ఎంపీ దీపక్ బైజ్ బాధ్యతలు తీసుకున్న సమయంలోనే ఈయన రాజీనామా చేయడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఇక ఈయన తర్వాత ఆయా మంత్రి పదవిని రాష్ట్ర సీఎం PCC అధ్యక్షుడిగా ఉన్న మోహన్ కు కట్టబెట్టారు.