ఫ్యాక్ట్ చెక్: కరోనా కారణంగా విద్యాసంస్థలు క్లోజ్..?

-

కరోనా కారణంగా గతం లో చాలా మంది ఎంతగానో సఫర్ అయ్యారు. అప్పట్లో చాలా మంది కరోనా వలన ఆసుపత్రి లో ఎడ్మిట్ అయ్యారు. అలానే చాలా మంది చనిపోయారు కూడా ఏది ఏమైనా కరోనా ప్రమాదకరం కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి మళ్లీ ఎదురైంది. అక్కడక్కడ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కరోనాకి సంబంధించి వార్తలు నెట్టింట షికార్లు కొడుతున్నాయి.

తాజాగా కరోనా కి సంబంధించిన వార్త ఒకటి వైరల్ గా మారింది. కరోనా కారణంగా విద్య సంస్థలు క్లోజ్ అంటూ ఒక వార్త వచ్చింది. మరి ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. కరోనా కారణంగా రానున్న 15 రోజులు స్కూల్స్, కాలేజీలు మూతపడతాయని ఒక వార్త వచ్చింది నిజంగా కరోనా వలన విద్యా సంస్థలను క్లోజ్ చేస్తున్నారా..? ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వార్త నిజం కాదని ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. కాన్పూర్, నోయిడా, లక్నో, బీహార్, జార్ఖండ్, పంజాబ్, ఢిల్లీ లో మాత్రం చలి కారణంగా పాఠశాలలను క్లోజ్ చేశారు. అంతే కానీ కరోనా కారణంగా స్కూల్స్ కాలేజీలని క్లోజ్ చేయడం లేదు ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే ఇటువంటి నకిలీ వార్తలని అనవసరంగా నమ్మదు ఇతరులకు షేర్ చేయొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news