దమ్ముంటే ఆ పని చెయ్యి.. రేవంత్ రెడ్డి కి ఈటల సవాల్..!

-

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావడంతో తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి నేతలు విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లుతో హీట్ ఎక్కిస్తున్నారు. కొంతమంది ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతూ ప్రత్యర్థులపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. మల్కాజ్గిరి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారంతో హోంరెత్తిస్తున్నారు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మీద ఫైర్ అవుతున్నారు.

ఇందులో భాగంగా ఈటలా ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దమ్ముంటే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిని ప్రకటించాలని చాలెంజ్ చేశారు. మల్కాజ్గిరిలో తన మీద పోటీ చేయడానికి కాంగ్రెస్ డబ్బు ఉన్న అభ్యర్థి కోసం వెతుకుతోందని ఈటల అన్నారు. డబ్బు సంచులు ధర్మానికి మధ్య జరిగే ఎన్నికల అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నీటి బుడగని ఈటల అన్నారు అధికారం కోసం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అమలుకి సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news