ఈటల, బండి సంజయ్ ప్రెస్ మీట్ .. ఏం మాట్లాడారో తెలుసా?

న్యూఢిల్లీ: ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ధర్మేంద ప్రధాన్ సమక్షంలో ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ బీజేపీ కేంద్ర నాయకత్వ విశ్వాసాన్ని నిలబెడతానన్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పారు. త్వరలో తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలుంటాయన్నారు. బీజేపీ ఆశయాలను బలపర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని ఈటల తెలిపారు.

కేంద్రమంత్రి ధర్మేద్ర ప్రధాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారన్నారు. ఈటల రాజేందర్‌ చేరికతో తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖాయమని పేర్కొన్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ గడీల పాలన నుంచి ఈటల బయటకు వచ్చారన్నారు. రాబోయే రోజుల్లో చాలా మంది బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు. కేసీఆర్‌ను ఎదుర్కునే దమ్మున్న పార్టీ బీజేపీ అని అ