కేసీఆర్ కు థ్యాంక్స్ … కేసీఆర్ తో మాట్లాడే ఛాన్సే లేదు: ఈటెల

తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖా నుంచి మంత్రి ఈటెల రాజేంద్రను తప్పించడం రాజకీయంగా సంచలనం అయింది. దీనితో ఆయన వేయబోయే అడుగులు ఏంటీ అనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇక తాజాగా తనను శాఖ నుంచి తప్పించడంపై ఈటెల స్పందించారు. తనపై ప్రణాళిక ప్రకారం కుట్ర జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ఏ శాఖను అయినా తీసుకునే అధికారం కేసీఆర్ కు ఉందన్నారు.

తనపై ప్రణాళిక ప్రకారం కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. త్వరలోనే నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అని అన్నారు. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు అని ఆయన హెచ్చరించారు. ఏ శాఖ లేకపోయినా ప్రజలకు సేవ చేస్తా అని ఆయన హామీ ఇచ్చారు. శాఖను తొలగించినందుకు కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్తున్నా అన్నారు. కేసీఆర్ తో మాట్లాడే ప్రయత్నం చేయను అన్నారు.