బీర్పూర్ మందుపాతర ఘటనకు 32 ఏళ్ళు గడిచాయి. సారంగపూర్ బీర్ పూర్ అటవీ ప్రాంతాల్లో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి నేటికి 32 ఏళ్ళు పూర్తి అయింది. పోలీసులను టార్గెట్ చేసిన ఘటనలో 14 మంది అమాయకులు బలి అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్స్ పేల్చిన తొలి మందుపాతర ఇదే. నక్సల్స్ ఉద్యమ చరిత్రలో మాయని మచ్చగా ఈ ఘటన నిలిచింది.
మృతుల్లో మావోయిస్టు అగ్రనేత గణపతి బంధువులు కూడా ఉన్నారు. అమర్చిన ఏడు క్లైమార్ మైన్స్ లో ఆరింటిని వదిలి వెళ్ళారు నక్సల్స్. గణపతి లొంగుబాటు సందర్భంగా జగిత్యాల వ్యాప్తంగా బీర్పూర్ ఘటన చర్చనీయంశంగా మారింది. ఈ ఘటనపై అప్పట్లో మావోల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాతి నుంచి మావోలు జాగ్రత్తగా వ్యవహరించారు.