బిల్లు కట్టలేదని తాళ్లతో కట్టేసి..!

-

కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు మనుషులలో మానవత్వం అనేది ఉందా అని అనిపిస్తుంది. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. చికిత్స బిల్లు కట్టలేదని ఓ వృద్ధుడిని తాళ్లతో కట్టేశారు. షజాపూర్‌కు చెందిన ఓ ఆస్పత్రిలో వైద్య ఖర్చులు 11,000 చెల్లించనందుకు బాధితుడి కాళ్లు, చేతులను ఆస్పత్రి బెడ్‌కు కట్టేశారని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందిస్తూ సదరు ఆస్పత్రిపై కఠిన చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news