ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రమేష్ కుమార్ రాజీనామా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన లక్ష్యంగా అధికార పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్నికలను వాయిదా వేయడంపై అసహనంగా ఉన్న అధికార పార్టీ ఆయన లక్ష్యంగా మండిపడుతుంది. ఎవరిని అడిగి వాయిదా వేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అధికార పార్టీ.
ఇక ఆయనకు సిఎస్ లేఖ రాయడం, ఆ తర్వాత రమేష్ కుమార్ లేఖ రాయడం, తాజాగా రమేష్ కుమార్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ వెళ్ళడం సంచలనంగా మారాయి. తాను లేఖ రాయలేదు అని రమేష్ కుమార్ చెప్తున్నా సరే ఆయన ప్రమేయం లేకుండా ఆ లేఖ వెళ్ళే అవకాశం లేదని పలువురు అంటున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. లేఖ పంపిన వారిపై చర్యలు తీసుకోవాలని రెడీ అవుతుంది.
దీనితో తీవ్ర ఒత్తిడి లోకి వెళ్ళిపోయిన రమేష్ కుమార్ రెండు రోజుల నుంచి ఎవరిని కలవడం లేదు. ఆయన నిన్నటి కుటుంబ సభ్యులను అత్యంత సన్నిహితంగా ఉన్న వారిని మాత్రమే కలుస్తున్నారు. ఆయన రాజీనామా చేస్తున్నారని పలువురు అంటున్నారు. ఒత్తిడి భరించలేని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసే అవకాశం ఉందని అంటున్నారు. రేపు సాయంత్రంలోగా ఆయన నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.