హైదరాబాద్ లో వరద సాయం విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో వరద సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థ సారథి నేడు ఆదేశాలు ఇచ్చారు. వరద సాయం కోసం అభ్యర్ధనల స్వీకరణ సహా ఇప్పుడు ఇచ్చే వరద సాయాన్ని ఆపేయాలని ఆయన ఆదేశించారు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత యధావిధిగా పంపిణీ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అయితే నిన్న ఎన్నికల సంఘం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల చేసిన సమయంలో వరద సాయం ఖాతాల్ల్లో మాత్రమే జమ చేయాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ చేయాలని, చేతికి ఇవ్వరాదు అని స్పష్టత ఇచ్చింది.