దేశవ్యాప్తంగా శుక్రవారం తొలి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా,16.63 కోట్ల మంది ఓటర్లు రేపు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 18 లక్షల మంది పోలింగ్ అధికారులను మోహరించింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న రిజల్ట్స్ వెల్లడికానున్నాయి.
తొలి విడత ఎన్నికలు దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో జరగనున్నాయి. రేపు జరగబోయే ఎన్నికల్లో 16.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.ఇందులో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది స్త్రీ ఓటర్లతో పాటు 11,371 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 35.67 లక్షల మంది మొదటిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 20-29 సంవత్సరాల మధ్యలో 3.51 కోట్ల మంది యువ ఓటర్లు ఉన్నారు.