కవిత అరెస్ట్పై స్పందించిన కేసీఆర్..

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం తొలిసారి స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమేననీ అన్నారు.తెలంగాణ భవన్‌లో కొనసాగుతున్న బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లిక్కర్ స్కామ్ పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని ఆరోపించారు . బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని తెలిపారు. దీంతో తాము బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి నోటీసులు పంపించామని కేసిఆర్ వెల్లడించారు. అందుకే ఎమ్మెల్సీ కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారని కేసీఆర్ మండిపడ్డారు.

కాగా, దుర్మార్గుడైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. బీఆర్ఎస్‌ పార్టీ మీద కక్ష కట్టారు అని , ఎమ్మెల్సీ కవితపై ఎలాంటి కేసు లేదు.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులో ఇరికించారన్నారు కేసిఆర్. ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా చూపలేక పోయారనీ కేసిఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news