విద్యుత్ వినియోగంలో తెలంగాణ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం విద్యుత్ వినియోగం పీక్స్ చేరుకుంది. దీంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ఈ రోజు 14,117 మెగావాట్లను విద్యుత్ డిమాండ్ అధిగమించాయి విద్యుత్ సంస్థలు. సాయంత్రానికి మరింతగా విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 13,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మాత్రమే ఉండేది. సోమవారం సాయంత్రం 3.54 నిమిషాలకు 13,857 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని ట్రాన్స్ కో, జెన్ కో వెల్లడించాయి. గతేడాది మార్చిలో జీహెచ్ఎంసీ పరిధిలో 55 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించగా… ఈ మార్చిలో ఇప్పటి వరకు 65 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలతో పాటు పరిశ్రమలు ఎక్కవగా పెరగడంతో అంతే స్థాయిలో కరెంట్ వినియోగం పెరుగుతోంది. దీంతో పాటు యాసంగి పంటలకు చేతికొచ్చే దశలో ఉండటంతో వ్యవసాయ మోటర్ల వినియోగం కూడా పెరిగింది. ఇక ఎండ తీవ్రతల కారణంగా డొమెస్టిక్ వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ పీక్స్ కు చేరుతోంది.