రైల్వే లెవల్ క్రాసింగ్‌ను దాటిన ఏనుగు.. వైరల్ వీడియో..!

-

సాధారణంగా మనం వెళ్లే రహదారిలో రైల్వే లెవల్ క్రాసింగ్‌లు ఉంటే మనం ఏం చేస్తాం..?రైలు వచ్చేంత వరకు ఆగి ఆ తరువాత గేట్లు ఎత్తగానే లెవల్ క్రాసింగ్‌లోంచి వెళ్లిపోతాం. ఇక కొందరు ద్విచక్ర వాహనదారులు గేట్లు ఎత్తకుండానే కింద నుంచి దూరి అవతలి వైపుకు వెళ్లే సాహసాలు చేస్తుంటారు. అది వేరే విషయం. అయితే ఆ ఏనుగు మాత్రం ఆ రైల్వే లెవల్ క్రాసింగ్‌ను ఎలాంటి జంకు లేకుండా దాటింది. ఈ క్రమంలో ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

elephant moved from railway level crossing breath taking viral video

రైల్వే లెవల్ క్రాసింగ్ దాటుతున్న ఓ ఏనుగును వీడియో తీసిన ఓ అటవీ శాఖ అధికారి ఆ వీడియోను ట్విట్టర్ పోస్ట్ చేయగా, ఆ వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆ వీడియోకు ఇప్పటికే అనేక లైకులు, రీ ట్వీట్లు, వ్యూస్ వచ్చాయి. కాగా అందులో ఓ ఏనుగు రైల్వే లెవల్ క్రాసింగ్ మొదటి గేట్‌ను ఎత్తుకుని దాటడం, ఆ తరువాత రెండో గేట్‌ను కాళ్లతో తొక్కుతూ దాటడం మనం చూడవచ్చు. అయితే ఆ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఏనుగుకు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం.. ఆ సమయంలో రైళ్లు రానందుకు కొంత వరకు హ్యాప్పీగా ఉందని.. కామెంట్లు చేస్తున్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news