సీఎం రేవంత్ రెడ్డి పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలు అయినా కూడా వృద్ధాప్య పింఛన్లను నాలుగు వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చడం లేదని బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఐదు హామీలపై అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేశారని మరి తెలంగాణలో పించన్లను రూ.4 వేలకు ఎప్పుడు పెంచుతారని ఆయన ప్రశ్నించారు.

శుక్రవారం ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ .. కేసీఆర్ పేరు ఉందనే నెపంతో పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవడం సరికాదని మండిపడ్డారు .దీని వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పుస్తకాలను యథావిధిగా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల్లో బీజేపీ పట్ల విశ్వాసం పెరుగుతోందని రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుంభకోణాలు జరిగినప్పుడు ఈడీ దర్యాప్తు చేయడం సహజం అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news