కువైట్ అగ్ని ప్రమాదం కేసులో ముగ్గురు అరెస్ట్..!

-

కువైట్ భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 45 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ 45 మంది పార్థివ దేహాలను వారి స్వగ్రామాలకు చేర్చారు. తొలుత కువైట్ నుంచి కేరళకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి తరలించారు. కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణమైన ముగ్గురు వ్యక్తులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్యూరిటీ గదిలో విద్యుత్ లోపం కారణంగా ఈ మంటలు చెలరేగాయి.

కార్మికులందరూ నిద్రలో ఉండటం.. పొగను పీల్చడం ద్వారా అక్కడికక్కడే ప్రాణాలను వదిలారు. ఒకే కంపెనీకి చెందిన 200 మంది కార్మికుల బస కోసం కంపెనీ ఒక అద్దె భవనాన్ని తీసుకుంది. ఆరు అంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజమున మంటలు చెలరేగడంతో తప్పించుకునే మార్గం లేక మెట్లపైనే సజీవదహనం అయ్యారు. అయితే బిల్డింగ్ నిర్మాణంలో భద్రతా విధానాలు పాటించకపోవడం.. అగ్నిమాపక నిబంధనలు నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే బిల్డింగ్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ ముగిసే వరకు కస్టడీలో ఉంటాడని కువైట్ ఉప ప్రధాని, రక్షణ మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news