ట్విట్టర్ షేర్లు కొనుగోలు చేసిన ఎలాన్ మాస్క్..!

-

టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్. ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ ట్విట్టర్ లో 9.2 % వాటాను కొనుగోలు చేశారు.గతంలో ట్విట్టర్ సామర్థ్యంపై, వాక్ స్వాతంత్రం పై మాస్క్ అనేక ప్రశ్నలను సంధించారు. దీంతోపాటు కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రూపొందించె ఆలోచనలో ఉన్నట్లు ట్వీట్ చేశారు.ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కలిగి ఉన్నట్లు యూఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ & ఎక్స్చేంజ్ కమిషన్లో దాఖలు చేసిన ఫైలింగ్ లోఎక్స్చేంజ్ కమిషన్లో దాఖలు చేసిన ఫైలింగ్ లో మాస్క్ ఈ సంగతి చెప్పారు. ఆయనకు ట్విట్టర్ లో 7,34,86,938 పేర్లు ఉన్నాయి.ట్విట్టర్లో వాటాలను మాస్క్ కొనుగోలు చేసిన వార్త బయటకు రాగానే సోమవారం ట్రేడింగ్ లో ఆ సంస్థ స్క్రిప్ట్ 26 శాతానికి పైగా దూసుకెళ్లి 49 డాలర్ల వద్ద నిలిచింది.

 

ట్రేడింగ్ ముగిసే సమయానికి ట్విట్టర్ షేర్ 39.31 డాలర్లుగా ఉంది. ట్విట్టర్ లో మాస్క్ వాటా 2.89 బిలియన్ డాలర్లు. దీంతో ఈ మైక్రో బ్లాగింగ్ సంస్థలోని అతిపెద్ద వాటాదారునిగా మాస్క్ నిలిచారు.ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ కంటే మాస్ కు నాలుగు రెట్లు వాటాలు ఉన్నాయి.జాక్ డోర్సీ కేవలం 2.25 శాతం వాటాలు మాత్రమే కలిగి ఉన్నారు.ట్విట్టర్ పాలసీలపై నిత్యం విమర్శలు గుప్పించే వారు మాస్క్.కానీ సుదీర్ఘకాలం ట్విట్టర్ మనుగడ సాగించడానికి ఆ సంస్థ పాలసీలే కీలకంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news