డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునేవారికి గుడ్ న్యూస్..!

-

మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా..? డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రభుత్వం కొత్త నియమాలను తీసుకు రావడం తో మీకు రిలీఫ్ గా ఉండనుంది. పైగా డ్రైవింగ్ లైసెన్స్ ని పొందడం కోసం మీరు ఆర్టీఓ ఆఫీస్ కి కూడా వెళ్లాల్సిన పనే లేదు. డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ లైసెన్స్ కోసం నమోదు చేసుకోవచ్చు.

 

పూర్తి వివరాల లోకి వెళితే.. లైసెన్స్ కోసం అర్హత సాధించడానికి ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవర్ స్కూల్ కేంద్రాలలో శిక్షణ పొందాలి. మీరు డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ టెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేస్తే డ్రైవింగ్ టెస్ట్ నుండి మీకు మినహాయింపు ఉంటుంది.

అయితే డ్రైవింగ్ స్కూల్స్ మరియు గుర్తింపు పొందిన ఏజెన్సీలు ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు మరియు తేలికపాటి మోటారు వాహనాల శిక్షణా కేంద్రాలకు మినిమమ్ ఒక ఎకరం భూమి ఉండాలి. అదే భారీ వాహనాలు మరియు కార్గో ట్రక్కుల ట్రైనింగ్ ఇచ్చే స్కూల్స్ కి అయితే రెండు ఎకరాలు ఉండాలి. అంతే కాక ఎగ్జామినర్ కనీసం 12 తరగతి పాస్‌ అయ్యి ఉండాలి.

ఆన్లైన్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వస్తుంది..?

మీరు ఈజీగా RTO వద్ద ఫిజికల్ టెస్ట్ కి బదులుగా ఆన్ లైన్ లో అటెండ్ అవ్వచ్చు.
ఆన్‌లైన్ టెస్ట్ ఆడిట్ కోసం ఎలక్ట్రానికల్ గా రికార్డ్ చేయబడుతుంది.
అయితే ఈ ఆన్‌లైన్ డ్రైవింగ్ టెస్ట్ ఫిజికల్ డ్రైవింగ్ టెస్ట్ కంటే బెస్ట్ అని అంతా భావిస్తున్నారు.
డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత.. సంబంధిత మోటారు వాహన లైసెన్స్ అధికారికి చేరుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news