మేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు ; జగన్‌ సర్కార్‌ కు ఉద్యోగుల వార్నింగ్‌!

-

ఏపీ జేఏసీ బండి శ్రీనివాస రావు ఏపీ సర్కార్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారాంశాన్ని మాత్రమే ఇచ్చారని.. సీఎస్ నివేదిక ప్రకారం అదనంగా జీతాలు రాకపోగా ఉన్న జీతాలకు కోత పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక చర్చలు ముఖ్యమంత్రి తోనే తప్ప అధికారులతో అయ్యే పని కాదని… ఈ నెల 9న విస్తృత స్థాయి సమావేశం ఉందన్నారు. అదే రోజు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టమని చాలా మంది అడుగుతున్నారని చెప్పారు.

ప్రభుత్వం నుంచి ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదని.. ఆర్ధిక మంత్రి, సీఎస్ మాకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని మండిపడ్డారు. ప్రభుత్వంతో ఘర్షణను మేము కోరుకోవటం లేదని… కానీ ప్రభుత్వమే మా పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని సీఎం చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని.. ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయనితెలిపారు. మిమ్మల్ని ఆందోళన బాటలో నెట్టేసిన పాపం ప్రభుత్వానిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు హామీ ఇచ్చి కూడా ఇప్పుడు నోరు విప్పటం లేదని… సీపీఎస్ ఉద్యోగుల వేల కోట్ల రూపాయలు ఎటు వెళ్ళాయో తెలియదన్నారు. ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరటం లేదని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news