జైలులో ఉన్న వారి కోసం ఖాళీ కుర్చీలు.. ఇండియా కూటమి ర్యాలీలో కీలక దృశ్యం..

-

ప్రతిపక్ష ఇండియా కూటమి ”ఉల్గులన్ న్యాయ్ మహార్యాలీ” పేరుతో జార్ఖండ్ అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) రాంచీ వేదికగా బల ప్రదర్శన నిర్వహించింది.ఈ సమావేశానికి అస్వస్థత కారణంగా రాహుల్ గాంధీ హాజరుకాలేదు. అయితే, జైలులో ఉన్న హేమంత్ సొరెన్,అరవింద్ కేజ్రీవాల్ భార్యలు కల్పనా సోరెన్ ,సునీతా కేజ్రీవాల్ సభకు హాజరయ్యారు. జేఎంఎం కార్యకర్తలు హేమంత్ సోరెన్ మాస్కులతో సభకు హాజరయ్యారు.

భూ కుంభకోణంలో మనీలాండరింగ్‌కి పాల్పడ్డాడనే ఆరోపణలతో హేమంత్ సోరెన్‌ని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ పాలసీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా రాంచీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో వేదికపై జైలులో ఉన్న వారి కోసం ఖాళీ కుర్చీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.జైలు తాళం బద్ధలు కొట్టండి ,జార్ఖండ్ తలవందు వంటి నినాదాలు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version