ఛత్తీస్ గడ్ లోని గరియాబాద్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ నల్గొండ జిల్లాకు చెందిన మావోయిస్ట్ మృతి చెందారు. నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పాక హన్మంతు మరణించినట్టు ఛత్తీస్ గఢ్ పోలీస్ అధికారులు వెల్లడించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. 45 సంవత్సరాల క్రితం పాక హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. ఈ 45 ఏల్ల పాటు అజ్నాతంలోనే గడిపారు. నల్గొండ పట్టణంలోని ఏబీవీపీ నాయకులు శ్రీనివాస్ హత్యలో పాక హనుమంతు నిందితుడుగా ఉన్నాడు. ఆ తరువాత హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లాడు.
అప్పటి నుంచి మావోయిస్టు పార్టీలో క్రీయాశీలకంగా పని చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే హనుమంతు తల్లిదండ్రులు చనిపోయారు. ఆయనకు ఇద్దరూ అన్నదమ్ములున్నారు. ఛత్తీస్ గడ్-ఒడిశా సరిహద్దులో మంగళవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 20 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.