తెలంగాణ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు నక్సలైట్లు మృతి !

తెలంగాణ రాష్ట్ర సరిహద్దు లో ఎన్‌ కౌంటర్‌ చోటు చేసుకుంది. ఛత్తీస్‌ ఘడ్‌ రాష్ట్ర బీజాపూర్ మరియు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో పోలీసులు మరియు నక్సలైట్ల ఎన్‌ కౌంటర్ చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఈ ఎన్‌ కౌంటర్ లో.. జరిగిన కాల్పుల్లో ఏకంగా ముగ్గురు నక్సలైట్లు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. సరిగ్గా తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మరియు బీజాపూర్ సరిహద్దులో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.

ముగ్గురు నక్సలైట్లు మృతి చెందటం తో పాటు ఘటనా స్థలం వద్ద ఎస్‌ఎల్‌ఆర్‌, ఎకె 47 రైఫిళ్లు పోలీసులకు లభ్యమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పోలీస్ మరియు తెలంగాణ గ్రే హౌండ్స్ ప్రొసీడింగ్స్ ఈ ఎన్‌ కౌంటర్‌ లో పాల్గొన్నట్లు సమాచారం అందుతోంది. ఈ ముగ్గురు ఛత్తీస్‌ ఘడ్‌ స్టేట్‌ కు చెందిన వారని తెలుస్తోంది.  అయితే.. ఈ ఎన్‌ కౌంటర్‌ ను పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఘటన గురించి ఇంకా వివ రాలు తెలియాల్సి ఉంది.