ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సులు బాదిన క్రికెటర్గా నిలిచాడు. బే ఓవల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో స్టోక్స్ ఈ ఫీట్ అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు సాధించిన న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ బ్రెండన్ మెక్ కల్లమ్ను అధిగమించి ఈ ఘనతను సాధించాడు.
బ్రెండన్ మెక్ కల్లమ్ ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్టు ఫార్మాట్ హెడ్ కోచ్ కావడం గమనార్హం. ఇప్పటి వరకు 90 టెస్టులు ఆడిన బెన్ స్టోక్స్ 109 సిక్సులు బాదాడు. 36 సగటుతో మొత్తం 5,652 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ టెస్టు ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 258 పరుగులు చేశాడు బెన్ స్టోక్స్.