లీడ్స్‌ టెస్ట్‌ : 432 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌

-

లీడ్స్‌ టెస్ట్‌ లో ఎట్టకేలకు ఇంగ్లండ్‌ జట్టు ఆలౌట్‌ అయింది. లీడ్స్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 432 పరుగులకు ఇంగ్లండ్‌ జట్టు ఆలౌట్‌ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ లో 354 పరుగుల ఆధిక్యం లో ఇంగ్లండ్‌ ముందంజ లో ఉంది. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ వివరాల్లోకి వస్తే.. కెప్టెన్‌ జో రూట్‌ 121 పరుగులు, బర్న్స్‌ 61 పరుగులు, హసీద్‌ హమీద్‌ 68 పరుగులు, డేవిడ్‌ మిలాన్‌ 70 పరుగులు ఇంగ్లండ్‌ జట్టుకు భారీ స్కోర అందించారు.

ఇక ఇండియా బౌలర్లలో… మహ్మద్‌ షమీ 4 వికెట్లు, సిరాజ్‌ 2 వికెట్లు, జడేజా 2 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు తీశారు. అయితే.. ఈ మ్యాచ్‌ లో బ్యాటింగ్‌ తో పాటు.. బౌలింగ్‌ లోనూ టీం ఇండియా విఫలమవడం తో ఇంగ్లండ్‌ జట్టు భారీ స్కోర్‌ చేయగలిగింది. ఇక మరికాసేపట్లో టీం ఇండియా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించనుంది. ఓపెనర్లుగా రోహిత్‌ మరియు రాహుల్‌ దిగనున్నారు. కాగా.. మొదటి ఇన్నింగ్స్‌ లో 78 పరుగులకే టీం ఇండియా అలౌటైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news