T 20 world cup : బంగ్లాదేశ్ పై ఇంగ్లాండ్ ఘన విజయం

-

టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్ మరియు బంగ్లా దేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు… అవలీలగా ఈ మ్యాచ్ లో గెలిచింది.

కేవలం 14.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు కోల్పోయి 125 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది ఇంగ్లాండ్ జట్టు. దీంతో బంగ్లాదేశ్ జట్టుపై ఎనిమిది వికెట్ల విజయాన్ని సాధించింది. జాసన్ రాయ్ 61 పరుగులు మరియు డేవిడ్ మిలాన్ 28 పరుగులు చేసి… జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. ఇక అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బంగ్లా… ఏకంగా 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే. బంగ్లా దేశ్ జట్టు.. బ్యాట్ మెన్స్ లలో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడం తో.. ఈ మ్యాచ్  ఇంగ్లండ్ జట్టు వశం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news