వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ గెలుపుతో ముగించింది ఇంగ్లండ్ జట్టు. శనివారం కోల్ కతా వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టు నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాక్.. 43.3 ఓవర్లలో 244 పరుగులు చేయగలిగింది. అఘా సల్మాన్ (51) హాఫ్ సెంచరీ సాధించాడు. కెప్టెన్ బాబర్ అజామ్(38), మహ్మద్ రిజ్వాన్ (36) భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు.
భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కి రెండో బంతికే షాక్ తగిలింది. అబ్దుల్ షపిక్ డకౌట్ అయ్యాడు. మూడో ఓవర్లో ఓపెనర్ ఫకర్ జమాన్ పెవిలీయన్ కు చేరాడు. బాబర్, రిజ్వాన్ కాసేపు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సౌద్ షకీల్ (29) పర్వాలేదనిపించాడు. చివరిలో రౌఫ్, షహీన్ అఫ్రిది(25) పోరాడాడు. చివరిలో వోక్స్.. రౌఫ్ వికెట్ తీయడంతో పాకిస్తాన్ ఓటమి ఖరారు అయింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. ముఖ్యంగా బెన్ స్టోక్స్ 84 పరుగులతో అద్భుతంగా రాణించాడు.