తెలంగాణ టీచర్ల కు ఇంగ్లీష్ ట్రైనింగ్….!

-

ప్రస్తుతం ప్రైవేట్ లో తెలుగు మీడియం స్కూల్లు కనిపించకుండా పోయాయి. టెక్నాలజీ పెరగటం, ఇంగ్లీష్ కు ప్రాధాన్యత పెరగటం తో తల్లి తండ్రులు కూడా తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలలో చేర్పించదానికే ఇష్టపడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ల విషయం పక్కన పెడితే ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది టీచర్లు ఇంగ్లీష్ రాకపోవడం తో బోధన కష్టం గా మారుతుంది. ఇప్పుడు ప్రభుత్వ పాటశాలలలో పూర్తిగా ఇంగ్లీష్ మీడయం వచ్చేసింది.

ఈ నేపథ్యంలోనే సర్కార్ స్కూళ్ళలో టీచర్లకు ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. తెలంగాణ లో మొత్తం 1.02 లక్షల మంది టీచర్లు ఉండగా అందులో 25 శాతం మంది టీచర్లు మాత్రమే ఆంగ్లం నేర్చుకున్నట్టు గుర్తించారు. దాంతో మరో 75 శాతం మందికి ఇంగ్లీష్ భాషపై పట్టు పెంచాలని విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే టీచర్లకు ఇంగ్లీష్ క్లాసులు ఏర్పాటు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news