ఓరుగల్లు ప్రజలకు రేవంత్ క్షమాపణలు చెప్పాలి – ఏనుగుల రాకేష్ రెడ్డి

-

ఓరుగల్లు ప్రజలకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. రాకేష్ రెడ్డి సహా 40 మంది ముఖ్య కార్యకర్తల నిర్బంధంలో ఉన్నారు. రాకేష్ రెడ్డి రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించి సిఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ పై పలు విమర్శలు చేసిన నేపథ్యంలో అలెర్ట్ ఐంది అధికార యంత్రాంగం. అడ్డుకుంటామని ప్రకటించకున్నప్పటికి హౌస్ అరెస్టు చెయ్యడం పై రాకేష్ రెడ్డి సీరియస్ అయ్యారు.

ENUGULA RAKESH REDDY, BRS

ప్రజా పాలనలో పోలీస్ లా పహారాలు, నిర్బంధాలు ఎందుకు? ప్రజా ప్రభుత్వం అంటూ బీరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై ఈ ఆంక్షలు ఎందుకు అని నిలదీశారు.ఆరు నెలల పాలనకే ఇంత అభద్రతా భావమా అరచకమా? మాకు కొట్లాడటం కొత్తకాదు. కానీ, మేం కేవలం నిర్మాణాత్మక సూచనలు, ప్రజల కొనలో విజ్ఞప్తులు మాత్రమే చేశాం…. ముఖ్యమంత్రి సహా సగం క్యాబినెట్, ఎంపీ లు, ఎంఎల్ఏ లు ఒక ప్రయివేటు హాస్పిటల్ ఓపెనింగ్ కోసం ఎగేసుకొని వస్తున్నప్పటికీ వరంగల్ ముఖ్యమంత్రి వస్తున్నాడు అన్న వాతావవరణం, ఆ కళే లేదన్నారు. నా ప్రెస్ మీట్ తర్వాతే సీఎం పర్యటనలో మార్పులు వచ్చాయి, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించేదాక సీఎం హోదాలో ఎలా పర్యటించాలో తెలియడం లేదు పాపం. కాకతీయ కళాతోరణాన్ని అధికారిక చిహ్నం నుండి తొలగించడం పై సీఎం స్పష్టత ఇవ్వాలన్నారు. .

Read more RELATED
Recommended to you

Latest news