లాజిక్‌లెస్ ట్విస్ట్: వైఎస్ సునీత టీడీపీలోకి?

-

రాజకీయాల్లో లాజిక్‌లు ఉండాలి…లాజిక్‌లు లేకుండా రాజకీయం చేస్తే అది ప్రజలు నమ్మలేరు. కాస్త నమ్మదగే విధంగా రాజకీయం చేస్తే ప్రజలు అర్ధం చేసుకుంటారు…అలా కాకుండా లాజిక్ లేకుండా రాజకీయం నడిపితే ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ సైతం ఒక విషయంలో లాజిక్ లేకుండానే మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. అదేంటో తెలుసుకునే ముందు ఒకసారి వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడుకుంటే…కరెక్ట్‌గా గత ఎన్నికల ముందు వివేకా హత్య జరిగింది..మొదట వివేకాది గుండెపోటు అని వైసీపీ నేతలు మాట్లాడారు..తర్వాత మర్డర్ అని తేలడంతో అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు చేయించారని ఆరోపించారు.

ఎన్నికల్లో కూడా విపరీతంగా ప్రచారం చేశారు..సరే ఏదేమైనా గాని వైసీపీ ప్రచారం వర్కౌట్ అయింది. వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అయిన సరే టీడీపీ వాళ్లే హత్య చేశారని ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం రుజువు చేయలేకపోయింది. పైగా ప్రతిపక్షంలో ఉండగా జగన్ సి‌బి‌ఐ విచారణ అడిగి, అధికారంలోకి వచ్చాక ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు.

అయితే వివేకా కుమార్తె సునీత సి‌బి‌ఐ విచారణ కోరడంతో, సి‌బి‌ఐ విచారణ మొదలైంది. అలాగే దొషులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు…కాకపోతే వారు వైఎస్ కుటుంబానికి, వైసీపీకి చెందిన వారే కావడంతో పరిస్తితులు మారిపోయాయి. తాజాగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు సి‌బి‌ఐ తన చార్జిషీటులో చేర్చించింది. ఇక దీనిపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. వేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన చార్జిషీటులో సీబీఐ పచ్చి అబద్ధాలను వండివార్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.

దానిని తీసుకుని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి శిక్ష వేయాలని తీర్మానం చేసేరకంగా చంద్రబాబు మాట్లాడారని, అలాగే సునీతమ్మను టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని,  వైఎస్‌ కుటుంబాన్ని ఎలాగోలా చీల్చాలని,  నేరాన్ని కుటుంబం మీదే తోసేయాలని చూస్తున్నారని అన్నారు. అయితే ఇదొక లాజిక్‌లెస్ ట్విస్ట్ అని టీడీపీ శ్రేణులు అంటున్నాయి…అడ్డంగా దొరికిపోయి ఏం కవర్ చేయాలో తెలియక సునీతకు టీడీపీ టికెట్ ఇస్తున్నారని లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతున్నాయి. అదంతా వైసీపీ ఆడుతున్న డ్రామా అని చెబుతున్నారు. మరి చూడాలి వివేకా కేసులో ఇంకెన్ని ట్విస్ట్‌లు వస్తాయో.

Read more RELATED
Recommended to you

Exit mobile version