వినాయక చవితి పండుగ ఏర్పాట్లు రాష్ట్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. బొజ్జ గణనాధులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పూజలు అందుకుంటున్నారు. ప్రతి గల్లీలో రంగురంగుల మండపాలు, డిస్కో లైటింగుల వెలుగులు విరజిమ్ముతున్నాయి. మొత్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది.ఈసారి తెలంగాణలో ఖైరతాబాద్ గణేశుడు 70 అడుగుల ఎత్తుతో ఈ ఏడాది హైలెట్‌గా నిలిచాడు. ఖైరతాబాద్‌లో వినాయకుడిని ప్రతిష్టించి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి భారీ ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
అయితే, మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టువైరల్ అవుతోంది. కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌజ్‌లోని ఆయన డెస్కులో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహా ఫోటోను ఆయన అందరితో పంచుకున్నారు. అంతేకాకుండ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం బంగారు ఆభరణాల వర్ణంతో ఉన్న ఈ గణేశుడు అందంగా మెరిసిపోతున్నాడు. కేటీఆర్ పోస్టు చేసిన గణేశ్ ప్రతిమ బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.