పేకాట ఆడుతున్నాడని కాల్చి చంపేసిన ఎస్సై….!

ఉత్తరప్రదేశ్ లో ఒక దారుణ ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి ఘటంపూర్ ప్రాంతంలోని భద్రాస్ గ్రామంలో బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మాజీ సభ్యుడిని ఒక ఎస్సై కాల్చి చంపారు. పేకాట ఆడుతున్నారు అనే సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడి వారు పరుగులు తీయగా ఎస్సై వారికి గురి పెట్టి కాల్పులు జరిపారు. ఆయనతో పాటుగా ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు.500 (card game) - Wikipedia

అయితే అతనిని టార్గెట్ చేసి అతి దగ్గరి నుంచి కాల్చి చంపారు ని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడుని సమాజ్ వాదీ పార్టీలో చురుకైన కార్యకర్తగా గుర్తించారు. పప్పు బాజ్‌పాయ్ (40) అని పోలీసులు పేర్కొన్నారు. మాజీ బీడీసీ సభ్యుడిని హత్య చేసిన ఆరోపణలపై సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌వీర్ సింగ్ యాదవ్‌ను అరెస్టు చేసినట్లు కాన్పూర్ (గ్రామీణ) పోలీసు సూపరింటెండెంట్ బ్రిజేష్ శ్రీవాస్తవ తెలిపారు.