ఏపీ నుండి తెలంగాణా విడిపోయిన నాటి నుండి ఏపీ రాష్ట్రం అవతరణ దినోత్సవం జరుపుకోవడం లేదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ముందు లాగే ఈరోజున దినోత్సవం జరుపుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ వేడుకలు జరపనున్నారు. రాజ్ భవన్లో జరిగే వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారు. అలాగే క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ జెండా ఆవిష్కరిస్తారు.
అనంతరం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. ఇటు జిల్లాల్లో మంత్రులు జెండాలు ఆవిష్కరించనున్నారు. ఈ సంధర్భంగా మోడీ విషెస్ చెప్పారు. ”కృషికి, సహృదయతకి ఆంధ్రప్రదేశ్ మారుపేరు. ఆంధ్రులు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అభివృద్ధికై ప్రార్ధిస్తున్నాను” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
కృషికి, సహృదయతకి ఆంధ్రప్రదేశ్ మారుపేరు. ఆంధ్రులు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అభివృద్ధికై ప్రార్ధిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) November 1, 2020