పల్నాడులో భారీ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు

-

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. పల్నాడు జిల్లా పరిధిలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడులో శ్రీ సిమెంట్ కంపెనీ తన తదుపరి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.2,500 కోట్ల పెట్టుబడితో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ సిమెంట్ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ఈ ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తిని కలిగి ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.

శ్రీ సిమెంట్ కంపెనీ
శ్రీ సిమెంట్ కంపెనీ

ప్రస్తుతం దేశంలో ఉన్న శ్రీ సిమెంట్ కంపెనీ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 46.4 మిలియన్ టన్నులు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దీని ఉత్పత్తి సామార్థ్యం 64 శాతంగా ఉంది. అయితే వ్యాపార విస్తరణలో భాగంగా ప్లాంట్ ఏర్పాటును 2024 డిసెంబర్ వరకు పూర్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే రూ.2,500 కోట్లు పెట్టుబడిని సమీకరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగా, సిమెంట్ ఏర్పాటుపై శ్రీ సిమెంట్ సంస్థ ఎండీ హెచ్ఎం.బంగూర్, జీఎండీ ప్రశాంత్ బంగూర్.. గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.

Read more RELATED
Recommended to you

Latest news