హిమాన్షు ను సీఎం చేయలేని కేసీఆర్ ప్లాన్ వేసారు : ఈటల

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మనవడు హిమాన్షు, ముని మనవడు వరకు సీఎం కావాలని.. తెలంగాణ చైతన్యాన్ని చంపేయాలని కేసీఆర్ చూస్తున్నాడని నిప్పులు చెరిగారు. ప్రగతి భవన్ కి కేసీఆర్ మమ్మల్ని రానియలేదు… ఆ రోజు నాతో పాటు ఉన్న ఎమ్మెల్యే.. ఇప్పుడు కేబినెట్ మినిస్టర్ అయిన ఆయన మళ్ళీ ఉద్యమం కరీంనగర్ నుండే పుడుతుంది అని అన్నారని గుర్తు చేశారు. రైతుబందు ఉన్నోళ్లకు ఇవ్వొద్దని అన్న కెసిఆర్.. మరి ఆయన ఎందుకు తీసుకుంటారని ప్రశ్నించారు.

రైతు కూలీలకు, జితగాళ్ళకు భీమా ఎందుకు లేదు.. కేసీఆర్ కు ఈటల కు రైతు భీమా రావొచ్చా.. కౌలు రైతులకు, కూలీలకు వద్దా ? అని నిలదీశారు. నన్ను పార్టీ లో అవమానించారు… నాకు స్టార్ కంపెయినర్ గా ఇవ్వలేదని మండిపడ్డారు. ఉద్యమ కారుల రక్తాన్ని కళ్ళ చూసిన వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్సీ… ఆయనకు 2018 లో డబ్బులిచ్చి నన్ను ఓడించాలని చూసారని అగ్రహించారు. ఈ ప్రభుత్వం కొనసాగడం, కేసీఆర్ సీఎం గా ఉండడం ఈ రాష్ట్రానికి అరిష్టం అని ప్రజలు భావిస్తున్నారని.. నేను పార్టీ నుండి బయటకు రాలేదు… వాళ్లే నను పంపించారని మండిపడ్డారు. ఇజ్జత్ ఉన్న వాడిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని.. హుజూరా బాద్ లో 6 వందల కోట్ల నల్లధనం ఖర్చు చేశారని అగ్రహించారు. దళితుల మీద ప్రేమ తో దళిత బంధు కాదు.. వాళ్ళ ఓట్ల మీద ప్రేమ ఉందని కెసిఆర్ పై ఫైర్ అయ్యారు.