ధాన్యం కొనుగోళ్లపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

-

హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కెసిఆర్ లో అసహనం పెరిగిపోయిందని.. అసహనం మొత్తం రైతుల పై చూపి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు ఈటెలరాజేందర్. కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాల నుండి తెలంగాణ ధాన్యం పూర్తిగా కొన్నదని.. రైతాంగం పండిచిన ధాన్యం మీద మొత్తం పెట్టుబడి కేంద్రమే పెడుతుందని పేర్కొన్నారు. కేంద్రం రా రైస్ మాత్రమే తీసుకుంటామని తెలిపింది,దుంపుడు బియ్యం వద్దని చేపింది దీనికి రాష్ట ప్రభుత్వం ఒప్పుకుందని గుర్తు చేశారు.

ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనక పోవడం తో రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయాలు పక్కన పెట్టీ రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ధనిక రాష్ట్రం అని చెప్పే ముఖ్యమంత్రి రైతుల ధాన్యం ఎందుకు కొనలేక పోతున్నవని సూటిగా అడుగుతున్నానన్నారు ఈటెలరాజేందర్. కేంద్రం అవసరానికి మించిన ధాన్యం కొనుగోలు చేయం అని ముందే చెప్పిన ప్రత్యన్యాయ చర్యలు తీసుకోక మొద్దు నిద్రలో ముఖ్యమంత్రి వున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రం లో పోలీసులను వాడుకొని ముఖ్యమంత్రి దౌర్జన్య రాజకీయాలు చేస్తున్నాడని.. రానున్న రోజులలో బీజేపీ పార్టీ అధికారం లోకి రాబోతుందని పేర్కొన్నారు ఈటెలరాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news