బ్రేకింగ్: కోదండ రామ్ తో ఈటెల అత్యవసర భేటీ…!

తెలంగాణాలో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుంది ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. ఈ వ్యవహారానికి సంబంధించి రాజకీయంగా ఇప్పుడు తెరాస కూడా ఆసక్తిగా చూస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈటెల రాజేంద్ర తెలంగాణా జనసమితి అధినేత కోదండ రామ్ తో అలాగే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కాసేపటి క్రితం భేటీ అయ్యారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపధ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈటెల బిజెపిలోకి వెళ్ళే అవకాశం ఉందనే వార్తల నేపధ్యంలో ఈ భేటీ కీలకం అయింది. ఇక కోదండరాం పార్టీలోకి ఈటెల రాజేంద్ర వెళ్ళే అవకాశం ఉండవచ్చనే ప్రచారం ఉంది. దీనితో తెరాస పార్టీ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి.