గత రెండు రోజులుగా ఈటల రాజేందర్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన బీజేపీ నాయకులను కలవడంతో అంతా ఆయన బీజేపీలో చేరుతారని అనుకుంటున్నారు. మంగళవారం కిషన్‌రెడ్డి, బండి సంజయ్, భూపేందర్ యాదవ్‌లతో ఈటల భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో అంతా ఆయన బీజేపీలోకి వెళ్తారని అనుకుంటున్నారు.
అయితే ఈ వార్తలపై ఈటల రాజేందర్ స్పందించారు. బుధవారం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. తాను బీజేపీ నాయకులను కలిసిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే తాను బీజేపీలో చేరట్లేదని తేల్చి చెప్పారు.
అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తాను స్వతంత్రంగా ఉంటానని చెప్పారు. మరే పార్టీలో చేరబోనని వెల్లడించారు. ఇక హుజూరాబాద్‌లోని తన ఎమ్మెల్యే పదవికి కూడా త్వరలోనే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కొవిడ్ ప్రభావం తగ్గాక దీనిపై నిర్ణయం తీసుకుంటానని వివరించారు. హుజురాబాద్ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఈ మేరకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్టు వివరించారు.