మల్కాజ్ గిరిలో ఈటెల రాజేందర్ విజయం… దుండిగల్ విలేజ్ లో మిన్నంటిన సంబరాలు

-

ఇండియాలోనే అతిపెద్ద నియోజకవర్గం, తెలంగాణలో మినీ ఇండియాగా భావించే మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో 38 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గంలో గెలుపు కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఈ పోటీలో చివరకు బిజెపి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఈటెల రాజేందర్ భారీ విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ తరపున సునీతా మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేయగా ఈటల రాజేందర్ కి 3.50లక్షల ఓట్లకుపైగా మెజారిటీ వచ్చింది.

ఇక ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో మేడ్చల్ జిల్లాకు చెందిన దుండిగల్ గ్రామంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అంతేకాకుండా ఎల్‌బీ నగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి తదితర ప్రాంతాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

కాగా, వామపక్ష భావజాలం కలిగిన ఈటెల రాజేందర్ తొలిసారి 2004 ఎలక్షన్లో కమలాపూర్ నుంచి పోటీ చేసి సమీప అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిని ఓడించి టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఏపీ శాసనసభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు . 2009 ఎన్నికల్లో కమలాపూర్ నుంచి కాకుండా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణమోహన్ రావుపై 56,752 ఓట్ల మెజారిటీ సాధించాడు.

Read more RELATED
Recommended to you

Latest news