లాక్‌డౌన్‌.. స్టార్‌ మా ను వెనక్కి నెట్టిన ఈటీవీ

-

కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో… సీరియల్స్‌, సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ చానళ్లు సీరియళ్ల స్థానంలో గతంలో ప్రసారమైన షోలను, సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో టీవీ వీక్షకులను కట్టిపడేసేలా గతంలో మంచి రేటింగ్‌ సాధించిన ప్రోగామ్స్‌ను, సినిమాలను ప్రసారం చేయడం సవాలుగా మారింది.

ముఖ్యంగా తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ చానళ్ల మధ్య ఈ విషయంలో గట్టి పోటీ నెలకొంది. అయితే 13వ వారంలో(మార్చి 28 నుంచి ఏప్రిల్‌3) మాత్రం బార్క్‌ రేటింగ్‌ పరంగా ఈటీవీ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. గతవారం అగ్రస్థానంలో ఉన్న స్టార్‌ మా రెండో స్థానంలోని వెళ్లిపోయింది. ఈటీవీ 5.62 లక్షల ఇంప్రెషన్స్ దక్కించుకోగా, స్టార్‌ మా 5.23 లక్షల ఇంప్రెషన్స్, మూడో స్థానంలో ఉన్న జెమినీ టీవీ 4.11 లక్షల ఇంప్రెషన్స్, నాలుగో స్థానంలో ఉన్న జీ తెలుగు 3.73 లక్షల ఇంప్రెషన్స్ సాధించాయి.

ఈటీవీ యజమాన్యం వద్ద మంచి మంచి సినిమాలు లేకపోయినా.. రియాలిటీ షోలు, ఈవెంట్లతో భారీ స్థాయిలో వీక్షలకులను సంపాదించుకుంది. ఇప్పడు లాక్‌డౌన్‌ వేళ అన్ని చానళ్లలో సీరియల్స్‌ నిలిచిపోవడంతో.. ఈటీవీ యజమాన్యం గతంలో ప్రసారమైన షోలను, ఈవెంట్లను ప్రసారం చేస్తోంది. ఈ షోలలో ఉన్న నటులకు బుల్లితెరపై ఆదరణ ఉండటంతో.. ఈటీవీ రేటింగ్‌ పరంగా టాప్‌ ప్లేస్‌లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news