సాధారణంగా భర్తలు సిగరెట్ తాగడం అనేది భార్యలకు నచ్చదు. కొంత మంది భార్యలు దీన్ని ఓకే అన్నా మిగిలిన వాళ్ళు మాత్రం దీనికి అంగీకారం తెలిపే అవకాశం ఉండదు. అందుకే చాలా మంది భర్తలు బయట సిగరెట్ తాగి ఇంటికి వస్తూ ఉంటారు. ఇది నచ్చని భార్యలు గొడవలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే సిగరెట్ మానాలని భార్య చెప్పడం తో ఒక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
తమిళనాడులోని సాలిగ్రామం మదియళగన్‌కు చెందిన 72 ఏళ్ళ నరసింహన్ బస్ డ్రైవర్ గా పని చేసారు. ఆయన విధుల నుంచి తప్పుకుని ఇంట్లో ఉంటున్నారు. కొన్నేళ్ళు గా ఆయన సిగరెట్ అలవాటు ఎక్కువగా ఉంది. దీనితో భార్యా భర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉండేవి. అయినా సరే వినే వాడు కాదు. దీనితో భార్య ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు ఈ అలవాటు అని మండిపడింది.
దీనితో నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. బుధవారం ఇద్దరి మధ్య గొడవ జరగగా భర్త టాయిలెట్ లో ఉన్న యాసిడ్ తాగి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయినా సరే లాభం లేకపోయింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.