ఏప్రిల్ 14 తర్వాత బస్సులు లేనట్టే, ఆర్టీసి కీలక నిర్ణయం ఇదే…!

-

లాక్ డౌన్ ఈ నెల 14 ముగిసే అవకాశాలు ఉన్న నేపధ్యంలో కచ్చితంగా బస్సులు నడుస్తాయి అని భావిస్తున్న ఏపీ ప్రజలకు ఆర్టీసి బ్యాడ్ న్యూస్ చెప్పింది. రిజర్వేషన్లను నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి సర్వీసులు పునరుద్ధరించాలని భావించింది. అందుకే రిజర్వేషన్లను ఓపెన్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉండటం కరోనా ప్రభావం క్రమంగా పెరగడం తో ఏపీఎస్‌ఆర్టీసీ పునరాలోచనలో పడింది.

ఈ నెల 5 నుంచి రిజర్వేషన్లు మొదలయ్యాయి. ఆన్లైన్ లో భారీగా ప్రయాణికులు టికెట్ లు బుక్ చేసుకున్నారు. విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్, విశాఖ సహా పలు నగరాలకు భారీగా వెళ్తారు. వీరిలో ఐటి ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. అయితే వాటిని గురువారం నుంచి నిలిపివేసింది. నిన్నటి వరకు ఇప్పటి వరకు వివిధ మార్గాల్లో 45 వేల టికెట్లు బుక్‌ చేసారు. లాక్ డౌన్ ని పొడిగించడం ఖాయంగా కనపడుతుంది.

తెలంగాణాలో కూడా లాక్ డౌన్ కొనసాగించడం, చెన్నై లో కేసులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో తమిళనాడు ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విషయంలో ముందుకి వెళ్ళే సూచనలే కనపడుతున్నాయి. ఇక హైదరాబాద్ కి వెళ్ళే ఉద్యోగులు ఎలా అయినా వెళ్ళాలి అనుకున్నా అది సాధ్యం కాని పని. బస్సులు నడపటంపై 13న స్పష్టత ఇస్తామని ఆర్టీసి చెప్తుంది. లాక్ డౌన్ కొనసాగిస్తే రిజర్వేషన్ ఉన్న వారికి డబ్బులు రీ ఫండ్ చేస్తామని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news