తమిళనాడులో నీట్ పరీక్షకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో డీఎంకే నేత ఆర్‌ఎస్ భారతి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తమిళనాడులో అందరికీ విద్య అందుబాటులోకి తెచ్చింది ద్రవిడ ఉద్యమమేనని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనవి.
నేడు కుక్కలు కూడా బీఎ పట్టాలు పొందుతున్నాయని ,నీట్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.డీఎంకే విద్యార్థి విభాగం కార్యదర్శి, కాంచీపురం ఎమ్మెల్యే ఎజిలరసన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా భారతి ఈ వ్యాఖ్యలు చేశారు.
నేను బి.ఎల్‌తో న్యాయవాదిని. ఎళిలరాసన్ బి.ఇ., బి.ఎల్. ఇవేవీ ఏ వంశం లేదా తెగ నుండి వచ్చినవి కావు. నేను బి.ఏ చేస్తున్నప్పుడు సిటీలో ఒకరే చదివేవారు. ఇంటి ముందు నేమ్ బోర్డు పెట్టేవారు. కాని ఈరోజు నగరంలో అందరూ డిగ్రీ చదువుతున్నారు, కుక్క కూడా బీఏ పట్టా పొందగలదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రగతి వెనుక ద్రవిడ ఉద్యమం ఉంది” అని ఆర్ఎస్ భారతి తెలిపారు. ఆర్ఎస్ భారతి ప్రకటనపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఆర్‌ఎస్ భారతి ప్రకటన తమిళనాడు విద్యార్థులందరినీ అవమానించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు.