రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని భావించిన విషయం తెలిసిందే.ఈ మేరకు భూసేకరణ ప్రక్రియలో రైతులతో ప్రభుత్వానికి సయోధ్య కుదరడం లేదు. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
‘మమ్మల్ని చంపినా ప్రభుత్వానికి మా భూములివ్వం..మాకు ఇండస్ట్రియల్ పార్కు వద్దు’ అని భూ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకొని రైతులు ఆందోళనకు దిగారు.ఇండస్ట్రియల్ పార్క్ భూసర్వేను వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించి రైతులు ధర్నా చేశారు. వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళం, మా పచ్చని పొలాలను ఇండస్ట్రియల్ పార్క్ కోసం తీసుకోవద్దని రైతులు ఆందోళనకు దిగారు.దీంతో రైతులు వెనుదిరగాల్సి వచ్చింది.
మమ్మల్ని చంపినా ప్రభుత్వానికి మా భూములివ్వం.. మాకు ఇండస్ట్రియల్ పార్కు వద్దు
భూ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకొని రైతులు ఆందోళనకు దిగారు
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ భూసర్వేను వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించి రైతులు ధర్నా చేశారు… pic.twitter.com/TDErMBEO8P
— Telugu Scribe (@TeluguScribe) March 19, 2025