డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు కోసం1511 కోట్లు కేటాయింపులు చేసింది తెలంగాణ సర్కార్. ఇవాళ తెలంగాణ ప్రభుత్వ 2025-26 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు భట్టి విక్రమార్క. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూల వ్యయం రూ.36,504 కోట్లుగా ప్రతిపాదించారు.
ఈ క్రమంలోనే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. అందులో మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత కింద పెన్షన్ల పెంపు లాంటి పలు పథకాలు అన్నింటినీ ఇప్పటికే అమలు చేస్తున్నామని వివరించారు. కాగా, బడ్జెట్ ప్రసంగం ఇంకా కొనసాగుతోంది. ఈసారి రూ. 3,04,965 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారు.