అందరికీ వ్యాక్సిన్ అక్కర్లేదట.. ఆరోగ్య మంత్రి కీలక ప్రకటన !

మన దేశంలో అందరికీ వ్యాక్సిన్ అక్కర్లేదని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. మన దగ్గరే కాదని ప్రపంచం మొత్తం మీద కూడా ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం లేదని అది సైంటిఫిక్‌ పద్ధతి కాదని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. వైరస్‌ తన పంథాను మార్చుకుంటున్న కొద్దీ, దాన్ని బట్టి మన ప్రాధాన్యతలను మార్చుకోవాలని ఆయన నిన్న లోక్‌ సభలో క్వశ్చన్‌ అవర్‌ సందర్భంగా చెప్పారు. టీకా కార్యక్రమంలో వేగం పెరుగుతున్నందున అందరికీ టీకాలు వేస్తారా? అని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సలహా మేరకు ఆరోగ్య రంగం, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల రంగం, వృద్ధులు, 45 సంవత్సరాలు దాటి వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ అందిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అందాలంటే కష్టమన్న ఆయన ప్రాధాన్య వర్గాల వారీగా కరోనా టీకాలు వేస్తున్నామన్నారు.