శ్రావణమాసంలో ఇంట్లో ఈ మొక్కలు నాటితే శుభప్రదం..!

-

శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లు ఓ దేవాలయంలా మారుతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు పూటల ప్రత్యేక పూజలతో ఇళ్లంతా ఆధ్యాత్మికత వెదజల్లుతుంది. అయితే ఈ పవిత్ర మాసంలో చేసే కొన్ని ప్రత్యేక పూజల వల్ల చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతుంటారు. ఈ మాసంలో ఇంట్లో తులసి మొక్క నాటితే ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయట. ఇవే కాకుండా వాస్తు ప్రకారం ఇంకా కొన్ని మొక్కలను ఈ మాసంలో నాటితే ఇంటికి ఎంతో మంచిదని పండితులు అంటున్నారు. వాటి వల్ల ఇంట్లో ప్రశాంతతతో పాటు ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని చెబుతున్నారు. మరి శ్రావణ మాసంలో మీ ఇంట్లో నాటాల్సిన మొక్కల గురించి తెలుసుకోండి..

​జమ్మి మొక్క.. ఇంట్లో జమ్మి మొక్క ఉంటే శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ మొక్కను పూజించడం వల్ల శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. జమ్మితో పాటు తులసిని కూడా కలిపి నాటితే ఇంకా అనేక ప్రయోజనాలు ఉంటాయట.

​అరటి మొక్క.. మీ ఇంటి ఆవరణంలో ప్రతికూలతను పోగొట్టడానికి అరటి మొక్కను నాటాలి. అరటి మొక్కను ప్రధాన ద్వారానికి కుడివైపున నాటితే సానుకూల ఫలితాలొస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు.

​ఉమ్మెత్త మొక్క.. పరమేశ్వరునికి ప్రీతి పాత్రమైన ఉమ్మెత్త మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది. ప్రతి శ్రావణ సోమవారం శివుడికి ఉమ్మెత్త పూలతో పూజచేస్తే శుభం కలుగుతుంది. ఎందుకంటే శివుడు ఈ పూలలో కొలువై ఉంటాడన్నది పూర్వీకుల నమ్మకం. అయితే ఈ మొక్కను ఆదివారం లేదా మంగళవారం రోజున నాటాలి. ఉమ్మెత్త ఉన్న ఇంట్లో ఉమామహేశ్వరులు కొలువై ఉంటారని పెద్దలు అంటుంటారు.

​చంపా మొక్క.. వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో అరటి, చంపా మొక్కలు నాటడం వల్ల శుభం కలుగుతుంది. మీరు జీవితంలో ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విముక్తి పొందడమే కాదు.. డబ్బుకు సంబంధించిన ప్రయోజనాలను పొందుతారు. ఈ మొక్కను ఇంట్లోని వాయువ్య దిశలో నాటడం వల్ల అత్యంత శుభ ఫలితాలను పొందుతారని వాస్తు పండితులు చెబుతుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news